News

6న గులాబి గూటికి డిఎస్


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ 6న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. బుధవారం ఉదయం సిఎం చంద్రశేఖర్ రావును క్యాంపు కార్యాలయంలో కలిసి మంతనాలు జరిపిన అనంతరం 6న తెరాసలో చేరాలని నిర్ణయంచుకున్నారు. ఆ రోజున సభ ఏర్పాటు చేసి పార్టీలోకి ఆహ్వానించాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కు ఎన్నికలు జరగనున్నందున, హైదరాబాద్ ఓటర్లపై ప్రభావం చూపేలా సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓట్లు వేసినా వృధా అవుతుందన్న భావన కలిగించేలా సభ నిర్వహించాలని తెరాస నాయకులు అనుకుంటున్నారు